హైదరాబాద్ లోని చందానగర్‌లో పరువు హత్యకు గురైన హేమంత్ అంత్యక్రియలు ముగిశాయి. లండన్‌లో ఉంటున్న అతని సోదరుడు హైదరాబాద్ వచ్చారు. ఇంటి దగ్గర హేమంత్ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. భార్య, తల్లిని ఓదార్చడం ఎవరివల్ల కాలేదు.
పోలీసుల భద్రత మధ్య.. అంతిమయాత్ర సాగింది. బంధువులు, కాలనీవాసులు హాజరయ్యారు. శోకసంద్రంలో యాత్ర సాగింది. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని బాధిత కుటుంబం వేడుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న హేమంత్‌ను ఆయన మామ, కుటుంబసభ్యులు కిరాయి గుండాలతో కలిసి రెండురోజుల క్రితం దారుణంగా హత్యచేశారు. పోలీసులు ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి: