హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సికింద్రాబాద్ గోపాల్‌పురం పరిధిలోని తన కార్యాలయ భవనంపై నుంచి దూకి సుష్మిత (21) అనే యువతి ఆత్మహత్య చేసుకున్నారు.
నగరంలోని నామాలగుండుకు చెందిన సుష్మిత టెక్‌మహీంద్ర సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఉదయం విధులకు హాజరైన యువతి తన కార్యాలయం భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: రైలు ఇంజిన్ ఎక్కి సెల్ఫీ- నిండు ప్రాణం బలి