ప్రపంచ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు రుణాలు రాకుండా చేసి.. ఇప్పుడు అమరావతికి నిధుల్లేవని ప్రభుత్వం చేతులెత్తేసిందని మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. అమరావతి అభివృద్ధికి నిధుల్లేవని ఆర్థికమంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. సింగపూర్ వెళ్లి ఏపీ ప్రతిష్ట దెబ్బతీసేలా మాట్లాడారని విమర్శించిన యనమల... ఇంతకన్నా దివాళా కోరుతనమేముంటుందని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధితోపాటే 13 జిల్లాల అభివృద్ధికి తెదేపా కృషి చేసినప్పుడు... వైకాపా వల్ల ఎందుకు కావడం లేదని నిలదీశారు. హిట్లర్‌ను గోబెల్స్ ముంచేస్తే, ఇప్పుడు జగన్‌ను తన మీడియా ముంచేస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలను చావుదెబ్బ తీసి, ఇన్ని నిర్వాకాలు చేస్తే ప్రజలు జగన్‌ను ఎలా ప్రశంసిస్తారో చెప్పాలన్నారు.
'సింగపూర్ వెళ్లి మరీ ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారు' - సింగపూర్ వెళ్లి ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారు-యనమల
సింగపూర్ వెళ్లి ఏపీ ప్రతిష్ట దెబ్బతీసేలా బుగ్గన మాట్లాడారని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు రుణాలు రాకుండా చేశారని అన్నారు. ఇప్పుడు అమరావతికి నిధులు లేవని చేతులెత్తేశారని మండిపడ్డారు. ఇంతకన్నా దివాళా కోరుతనం ఏముంటుంది? అని ప్రశ్నించారు.
ప్రపంచ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు రుణాలు రాకుండా చేసి.. ఇప్పుడు అమరావతికి నిధుల్లేవని ప్రభుత్వం చేతులెత్తేసిందని మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. అమరావతి అభివృద్ధికి నిధుల్లేవని ఆర్థికమంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. సింగపూర్ వెళ్లి ఏపీ ప్రతిష్ట దెబ్బతీసేలా మాట్లాడారని విమర్శించిన యనమల... ఇంతకన్నా దివాళా కోరుతనమేముంటుందని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధితోపాటే 13 జిల్లాల అభివృద్ధికి తెదేపా కృషి చేసినప్పుడు... వైకాపా వల్ల ఎందుకు కావడం లేదని నిలదీశారు. హిట్లర్‌ను గోబెల్స్ ముంచేస్తే, ఇప్పుడు జగన్‌ను తన మీడియా ముంచేస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలను చావుదెబ్బ తీసి, ఇన్ని నిర్వాకాలు చేస్తే ప్రజలు జగన్‌ను ఎలా ప్రశంసిస్తారో చెప్పాలన్నారు.
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) మనం ఫోన్లో మాట్లాడే సంభాషణలు, పంపిన సంక్షిప్త సమాచారం.. తీసిన ఫొటోలన్నీ తిరిగి మన ఫోన్ కే గుర్తుతెలియని వ్యక్తులు పంపిస్తే ఎలా ఉంటుంది.. విశాఖలో ఒక మహిళ ఉపయోగించే ఫోన్ కు ఇదేవిధంగా జరిగింది. చివరికి తన ఫోన్ హ్యాకింగ్ కు గురైందని తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా నిందితుడిని అరెస్టు చేశారు.
Body:నగరానికి చెందిన ఓ మహిళ తన మొబైల్ లో మాట్లాడిన మాటలు, మెయిల్ వ్యవహారాలు, తీసిన చిత్రాలు తిరిగి తనకే వస్తుండటాన్ని గుర్తించి తన ఫోన్ ఎవరో హ్యాక్ చేశారని నిర్ధారించుకుంది. దీనిపై సైబర్ క్రైం సిఐ గోపీనాథ్ కు ఫిర్యాదు చేశారు. ఈనెల 9వ తేదీన ఫిర్యాదు అందుకున్న సీఐ దర్యాప్తు ప్రారంభించి పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం, గండికోట వారి వీధికి చెందిన కాటూరి శైలేష్ ఈ సైబర్ నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు.
Conclusion:కాటూరి శైలేష్ బీటెక్ (ఐటి) మధ్యలో ఆపేసినా వెబ్ డెవలప్, ఫిషింగ్, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ డౌన్లోడింగ్ లో అనుభవం ఉంది. దీంతో 2017లో ఓ మహిళ వ్యక్తిగత వివరాలు కూడా ఈవిధంగా విధంగా తెలుసుకొని బెదిరింపులకు పాల్పడేవాడు. ప్రధానంగా డార్క్ వెబ్ సైట్స్ ప్రోక్సీ ఐపి (proxy ip)ని ఉపయోగించినట్లు సైబర్ పోలీసులు గుర్తించారు. శైలేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ తెలిపారు.