ఏడాదికి రూ.50వేలకు పైబడి అందే పథకాలు, సబ్సిడీలను రద్దు చేసి.. నేతన్న నేస్తం పేరుతో రూ. 24వేలు అందిస్తూ జగన్ రెడ్డి చేనేత కార్మికులను మోసం చేస్తున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల మందికి పైగా చేనేత కార్మికులు మగ్గాలపై పని చేస్తుంటే.. కేవలం 80 వేల మందికి కుదించి తీరని ద్రోహానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. పంచె పీకి తువ్వాలు కప్పినట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రాయితీలు, ప్రోత్సాహకాలు, సబ్సిడీ, భృతి, పరిహారం వంటి పదుల సంఖ్యలో ఉన్న పథకాలన్నింటినీ ఆపేసి.. నేతన్న నేస్తం పేరుతో హడావుడి చేసి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. చేనేత రంగానికి ఊతమివ్వాలనుకుంటే.. పని చేసే వారిని ప్రోత్సహించాలని సూచించారు. ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన సాయాన్ని పునరుద్ధరించి చేనేత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: