ETV Bharat / city

'నిర్లక్ష్యం.. అవినీతి మయం.. కక్షపూరితం.. వెరసి వైకాపా పాలన' - chandrababu comments on amaravathi news

తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి నివారణలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. కేంద్రం కేటాయించిన నిధులను సద్వినియోగం చేయకుండా.. రైతులు, వలస కూలీలు, ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ఆక్షేపించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అన్నింటా అవినీతి జరిగిందన్న ఆయన.. ఇళ్ల స్థలాల విషయంలో కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. అవినీతిని ప్రశ్నిస్తే తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు.

'నిర్లక్ష్యం.. అవినీతి మయం.. కక్షపూరితం.. వెరసి వైకాపా పాలన'

author img

By

Published : Jul 2, 2020, 2:10 PM IST

Updated : Jul 2, 2020, 2:41 PM IST

కరోనా పట్ల ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్​ ప్రపంచానికే పెద్ద సమస్యగా మారిందన్న ఆయన.. దీని వల్ల ప్రజల జీవితాల్లో చాలా సమస్యలు వస్తున్నాయని అన్నారు. ప్రజలకు అన్ని విధాలా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు. అందరూ అప్రమత్తం చేస్తున్నా.. మొదటి నుంచి సమస్యను జఠిలం చేస్తూ వచ్చారని మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రంలో నిత్యావసరాలు ఇవ్వటంతో పాటు రూ.500 అందించిందన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం మేలు చేసే ఆలోచన లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. పేదలు, రైతులు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నింటా అవినీతి

లాక్‌డౌన్‌ పెట్టాక ఏపీకి నిధులు కేటాయించామని కేంద్ర ఆర్థికమంత్రే స్వయంగా చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. వాటిని సద్వినియోగం చేసుకోకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్​ కొనుగోళ్లలో మంచి చెబితే వ్యక్తిగత దాడులకు దిగారన్న ఆయన.. వైకాపా నేతలు అన్నింటిలోనూ అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. 108 వాహనాల్లో భారీ అక్రమాలు జరిగాయని.. అనుభవం ఉన్నవాళ్లను కాదని.. విజయసాయిరెడ్డి వియ్యంకుడికి రూ.307 కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టారని ఆరోపించారు.

భారత్​ బయోటెక్​ సంస్థ కరోనా వ్యాక్సిన్​ తయారీలో పురోగతి సాధించడంపై హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు.. అప్పట్లో తాము తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు ప్రయోగాలకు ఉపయోగపడుతున్నాయని అన్నారు.

కక్షతోనే కేసులు

రాష్ట్ర ప్రభుత్వం కక్ష తీర్చుకునేందుకే.. తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అచ్చెన్నాయుడు తప్పు చేయకపోయినా అనేక విధాలుగా వేధిస్తున్నారన్న ఆయన.. శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తి పట్ల ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడికి రెండోసారి శస్త్ర చికిత్స చేయాల్సి రావడానికి ప్రభుత్వ వైఖరే కారణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని కొందరు అధికారులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని.. గతంలోనూ జగన్ చెప్పిందల్లా చేసి జైలుకెళ్లిన అధికారులున్నారని వారు గ్రహించాలని హితవు పలికారు.

మూడు రాజధానులు.. ఓ పిచ్చి వితండవాదం

మూడు రాజధానుల నిర్ణయం ఓ పిచ్చి వితండవాదమని చంద్రబాబు అన్నారు. రాజధానిని ముక్కలు చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించిన ఆయన.. అమరావతి నిర్మాణం కొనసాగించి ఉంటే ఈపాటికి నివాసయోగ్యంగా ఉండేదని వ్యాఖ్యానించారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిచ్చారని.. మూడు రాజధానులపై రాజకీయపార్టీలన్నీ చెప్పినా మూర్ఖంగా ముందుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి సంపద సృష్టించే ప్రాజెక్టన్న చంద్రబాబు.. రాజధాని రైతులు 200 రోజులుగా ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. ఈ నెల 4న రైతులకు సంఘీభావంగా ఐకాస ఇచ్చిన పిలుపునకు తెదేపా మద్దతిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

పెట్టుబడులు వెనక్కి

రాష్ట్రంలో 2 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టినవారంతా వెనక్కి వెళ్లిపోయారని చంద్రబాబు విమర్శించారు. అమర్ రాజా భూములు వెనక్కి తీసుకోవటం మరో దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలోనే అమర్ రాజాకు భూములు కేటాయించారని గుర్తు చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు జగన్ ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ప్రోత్సహకాలు ఏమీ లేవని తెలిపారు. పాత బకాయిలు చెల్లించటం తదుపరి వచ్చే ప్రభుత్వాల బాధ్యత అని చంద్రబాబు అన్నారు.

భూ కుంభకోణాలే

రాష్ట్రంలో వైకాపా నేతలు పెద్ద ఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. పేదవాళ్ల భూములు బలవంతంగా లాక్కొని.. మళ్లీ వాళ్లకే ఇళ్ల పట్టాలు ఇవ్వడమేంటన్న ఆయన.. వీటిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అన్నారు. పథకం ప్రకారమే గురజాలలో ఎస్సీని హత్య చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భవనాల రంగులకు వినియోగించిన రూ.2,600 కోట్లు అధికారులు, వారికి ఆదేశాలిచ్చిన వైకాపానే చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ ‌చేశారు. చట్టసభలను సొంత ప్రయోజనాలకే వినియోగిస్తున్నారని ఆయన ఆక్షేపించారు.

ఇదీ చూడండి..

'నిర్మలాసీతారామన్​పై కేసు ఎందుకు పెట్టలేదు..?'

Last Updated : Jul 2, 2020, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.