ETV Bharat / city

స్థానిక సంస్థల ఎన్నికలను హైజాక్ చేస్తున్న జగన్: కళా వెంకట్రావు - కృష్టా జిల్లా తాజా వార్తలు

ఎన్నికల సంఘం విధులకు అడ్డంకులు కలిగిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సీఎం జగన్​పై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా విధ్వంస రాజకీయాలను ఆక్షేపించారు.

kala venkat rao comments on ysrcp
వైకాపా పై కళా కాంమెంట్స్​
author img

By

Published : Jan 11, 2021, 7:49 PM IST

ఎన్నికల సంఘాన్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నించటం హేయమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు దుయ్యబట్టారు. జగన్​ రాక్షస మూకకు నాయకుడిగా వ్యవహరిస్తూ.. రాజ్యాంగ భక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం విధులను కూడా జగన్‌ హైజాక్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.

kala venkat rao press note
కళా వెంకట్రావు ప్రెస్​నోట్​

స్థానిక సంస్థల ఎన్నికలను రక్తసిక్తం చేసి దౌర్జన్యాలకు పాల్పడ్డారని, దాడులు, దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేసుకున్నారని విమర్శించారు. ఎదురించిన వారిని తప్పుడు కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు కూడా స్వేచ్ఛగా నిర్వహించుకోలేని దుస్థితిని జగన్ సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ హక్కులను దిగజార్చటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగేతర నిర్ణయాలతో డీజీపీ, సీఎస్ కోర్టు బోనులో చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి తెచ్చారని విమర్శించారు.

ఇదీ చదవండి: ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.