ETV Bharat / city

రేపు తెదేపా పొలిట్ బ్యూరో సమావేశం... 13 అంశాలపై చర్చ - amaravathi news today

అమరావతిలోని ఎన్టీఆర్ భవన్​లో రేపు తెదేపా పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 13 ప్రధాన అంశాలపై చర్చ జరగనుంది.

TDP polit bureau meeting in amaravathi at tomorrow
తెదేపా పొలిట్ బ్యూరో సమావేశం
author img

By

Published : Jan 3, 2021, 7:23 PM IST

వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే ప్రధాన ఏజెండాగా రేపు తెదేపా పోలిట్ బ్యూరో సమావేశం కానుంది. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్​లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో... నూతన కార్యవర్గం పాల్గొననుంది. పొలిట్ బ్యూరో సమావేశంలో 13 ప్రధాన అంశాలపై చర్చ జరుగనుంది.

ఎమ్మెల్సీ ఎన్నికలు, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలు, వ్యవస్థల విధ్వంసం-రాజ్యాంగ వ్యతిరేక చర్యలు, ప్రకృతి వైపరీత్యాలు-అన్న దాతలను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం, ప్రజలపై పన్నుల భారాలు-పెరిగిన ధరలు-అప్పుల ఊబిలో రాష్ట్రం, పథకాల పేరుతో కుంభకోణాలు-భారీ స్కాముల ఎక్స్​పోజర్, అమరావతి భవిష్యత్ కార్యాచరణ, క్షీణించిన శాంతి భద్రతలు-ప్రజల ప్రాణాలకు కరవైన రక్షణ - బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలపై పెరిగిన దాడులు, దేవాలయాలపై వరుస దాడులు - ప్రభుత్వ వైఫల్యాలు, ఇళ్ల పట్టాల పంపిణీ-భూసేకరణలో అవినీతి, పోలవరం భూసేకరణ, ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీ పోరాటాలు సమీక్ష, సంస్థాగత నిర్మాణం తదితరుల అంశాలను చర్చించనున్నారు.

ఇదీచదవండి.

కొవాగ్జిన్ టీకాను అన్నిదేశాలకు అందిస్తాం: భారత్‌ బయోటెక్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.