ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ గురించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం నేతలు తీవ్రంగా ఖండించారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకున్న నిర్ణయానికి సామాజికవర్గాన్ని అంటగట్టడంపై మండిపడ్డారు. పారాసిటమాల్ వాడాలని చెబుతున్న సీఎంకు కనీస అవగాహన లేదని దేవినేని ఉమ ఆరోపించారు. ఎస్ఈసీ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తే.. సీఎం జగన్... చంద్రబాబును విమర్శించడం విడ్డూరంగా ఉందని తెదేపా సీనియర్ నేత, ఎమ్మెల్యే చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా, జనసేన పార్టీలు కూడా ప్రభుత్వంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయని గుర్తుచేశారు.
రాగద్వేషాలకు, కుల మతాలకు అతీతంగా పని చేస్తానని సీఎంగా జగన్ ప్రమాణం చేశారని ధూళిపాళ్ల నరేంద్ర గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. ఎస్ఈసీకీ రాసిన లేఖ రాజ్యాంగ విరుద్దమని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. వెంటనే సీఎస్ రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారికి సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని హితవు పలికారు. ఒకసారి ఎన్నికలు ప్రకటించాక, ఇక ప్రభుత్వ పాత్ర ఉండదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :ఎన్నికల వాయిదాపై గవర్నర్‌కు ఎస్ఈసీ వివరణ