ETV Bharat / city

PATTABHI: ‘అంతుచూస్తాం.. బతకనివ్వం’ అంటూ హెచ్చరిస్తున్నారు..! - ఏపీ 2021 వార్తలు

వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు క్షమాపణ చెప్పకపోతే తనను బతకనివ్వమంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని... అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు.

tdp-national-spokesperson-kommareddy-pattabhiram-complaint-to-dgp
‘అంతుచూస్తాం.. బతకనివ్వం’ అంటూ హెచ్చరిస్తున్నారు..!
author img

By

Published : Sep 29, 2021, 7:47 AM IST

వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు క్షమాపణ చెప్పకపోతే ‘అంతు చూస్తాం... మాకు కనిపిస్తే బతకనివ్వం’ అంటూ తనను హెచ్చరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌.. రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. తెదేపా ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి పట్టాభి మంగళవారం డీజీపీ కార్యాలయంలో ఈ ఫిర్యాదును అందించారు. తనపై దుష్ప్రచారం చేస్తూ వేధిస్తున్నారని, వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని పట్టాభి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై విష ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

‘సామినేని ఉదయభాను రెండో కుమారుడు ప్రశాంత్‌ వ్యవహారశైలిపై మీడియా ముందుకు వాస్తవాలు తీసుకొచ్చినందుకు ఎమ్మెల్యే అనుచరులు సామాజిక మాధ్యమాల్లో వేధిస్తున్నారు. యర్రమాసు రామకృష్ణ, జోన్స్‌ పణితి, తదితరులు నాపైనా, నా కుటుంబ సభ్యులపైనా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు. పట్టాభిరామ్‌కు శ్రద్ధాంజలి అంటూ పోస్టులు పెడుతున్నారు. వీటిని చూసి మా బంధువులు, కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. జగ్గయ్యపేట వైకాపా సంగతి తెలుసుగా అని హెచ్చరిస్తూ మనోవేదనకు గురిచేస్తున్నారు...’ అని ఆ ఫిర్యాదులో పట్టాభి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ATTACK ON POSANI: పోసాని కృష్ణమురళిపై దాడికి యత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.