"ఫ్యాన్ కి ఓటేస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానన్న సీఎం జగన్, అదే ఫ్యాన్ కు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి కల్పించారు" అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిరుద్యోగ యువతతో లోకేశ్ సమావేశమయ్యారు. ప్రభుత్వ జాబ్ క్యాలెండర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తాము మోసపోయామని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ అవకాశం కోల్పోయామనే ఆందోళనతో నిరసనలు తెలిపిన తమపై కేసులు పెడుతున్నారని వాపోయారు. నిరుద్యోగుల పక్షాన నిలబడి వారి తరఫున ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధమని లోకేశ్ హామీ ఇచ్చారు.
“గత రెండేళ్లలో ఉద్యోగాలు రావట్లేదనే ఆందోళనలో రాష్ట్ర వ్యాప్తంగా 300మంది ఆత్మహత్య చేసుకున్నారు. రెండేళ్ల తర్వాత కేవలం 10వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ పేరిట జాదూ క్యాలెండర్ విడుదల చేశారు. పండుగ చేసుకోమంటున్నారు. ఎన్నికల ముందు బైబై బూబు అని ప్రచారం చేసి చంద్రబాబుని ఓడించామనుకుని రాష్ట్రాన్నే ఓడించారు. ఇప్పుడు పరిశ్రమలన్నీ బైబై ఆంధ్రప్రదేశ్ అంటూ ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. జే ట్యాక్స్ భయంతో రెండేళ్లగా ఒక్కపరిశ్రమా రాష్ట్రానికి రాలేదు. స్వచ్ఛంద సేవకులు అని ప్రకటించిన వాలంటీర్లను సైతం ప్రభుత్వ ఉద్యోగులగా చూపించటం సిగ్గు చేటు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏటా పోలీసు శాఖలో 6500 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు, గ్రూప్ 1, గ్రూప్ 2 విభాగాల్లో 2 వేల పోస్టులతో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. 25 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్‌స్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి. ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో 20,000 వేలు, రెవెన్యూ శాఖలో 740 పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలి. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువత కుటుంబాలకు రూ. 25 లక్షలు చొప్పున పరిహారం చెల్లించటంతో పాటు రద్దు చేసిన నిరుద్యోగ భృతిని పునరుద్ధరించాలి. జగన్ మెడలు వంచైనా 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేలా పోరాడతాం" - నారా లోకేశ్ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇదీ చదవండి: