ETV Bharat / city

'కోర్టులు, న్యాయమూర్తులపై వైకాపా నేతల వ్యాఖ్యలు సరికాదు' - కోర్టులపై వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండించిన తెదేపా

వైకాపా సర్కారు చర్యలను తెదేపా ఎంపీలు ఖండించారు. లోక్​సభ శూన్యగంటలో మాట్లాడిన గల్లా జయదేవ్... ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఏపీలో ఎస్సీలపై జరిగిన దాడులను ఆయన ప్రస్తావించారు. ఈ దాడులను అడ్డుకునేందుకు ఎస్సీ, ఎస్టీ చట్టంలో మార్పులు తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. లోక్​సభలో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి న్యాయస్థానాలను కించపరిచేలా మాట్లాడారని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆధారాలు లేని ఆరోపణలతో కోర్టుల మొట్టికాయలు తింటున్న వైకాపా సర్కారు న్యాయమూర్తులు, న్యాయవాదులపై నిందలు వేస్తున్నారన్నారు. వైకాపా ప్రభుత్వం కోర్టు తీర్పులను పట్టించుకోవడం లేదని తెదేపా రాజ్యసభ ఎంపీ కనకమేడల అన్నారు.

తెదేపా ఎంపీలు
తెదేపా ఎంపీలు
author img

By

Published : Sep 16, 2020, 9:25 PM IST

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మార్చాలని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎస్సీలపై దాడులు పెరుగుతున్న దృష్ట్యా చట్టంలో మార్పులు చేయాలన్నారు. అంటువ్యాధుల చట్టం తరహాలోనే 30 రోజుల్లో విచారణ ముగించాలని జయదేవ్ కోరారు. ఆరు నెలల్లో దోషులకు శిక్ష పడేలా ప్రస్తుత చట్టంలో మార్పులు చేయాలన్నారు. కఠినంగా వ్యవహరిస్తేనే ఎస్సీలపై దాడులు ఆగుతాయని పేర్కొన్నారు. ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన ఎస్సీ బాలిక అత్యాచారం, యూపీలో ఎస్సీ బాలుడిని చంపిన ఘటనలను గల్లా జయదేవ్‌ లోక్​సభలో ప్రస్తావించారు. ఏపీలో అధికార పార్టీ నాయకుడితో ఘర్షణ పడినందుకు ఎస్సీ యువకుడి మీసం తీసివేయించారన్నారు. దేశంలో ఇంకా ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని గల్లా జయదేవ్‌ పేర్కొన్నారు.

పోస్టు పెడితే భయపడే ప్రభుత్వం: రామ్మోహన్ నాయుడు

పార్లమెంట్ వేదికగా న్యాయస్థానాలపై వైకాపా లోక్​సభాపక్షనేత మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెదేపా ఖండించింది. కోర్టులను అగౌరవపరిచే, కించపరిచేలా మిథున్ రెడ్డి మాట్లాడారని తెదేపా లోక్​సభాపక్ష నేత రామ్మోహన్‌ నాయుడు అన్నారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై నిందలు వేయడం సరికాదన్న ఆయన.. ఆధారాలు లేని ఆరోపణలతోనే కోర్టుల్లో కేసులు నిలబడట్లేదన్నారు. అమరావతిలో రాజధాని పెడతామంటే ప్రతిపక్ష నేతగా జగన్ ఒప్పుకున్నారన్నారు. జగన్ అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట చెప్పి కొత్త స్కామ్‌కు తెరదీశారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుందని, వాటిపై సీబీఐకి కొన్ని కేసులు ఇచ్చి చేతులు దులుపుకోవాలని జగన్ సర్కారు చూస్తోందన్నారు. జగన్ ప్రభుత్వంలోని ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని రామ్మోహన్‌ నాయుడు డిమాండ్ చేశారు. హిందూ ఆలయాలపైనే ఎందుకు దాడులు జరుగుతున్నాయని రామ్మోహన్‌ నిలదీశారు. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితే భయపడే ఏకైక ప్రభుత్వం వైకాపా సర్కారు అని ఎంపీ ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. దుర్గగుడిలో సింహం ప్రతిమలు అదృశ్యం ఘటనకు బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కోర్టు తీర్పులు అమలు చేయడంలేదు : కనకమేడల

జగన్ అధికారంలోకి వచ్చాక 90 సార్లు కోర్టులు మొట్టికాయలు వేశాయని తెదేపా రాజ్యసభాపక్షనేత కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక్క జీవో కూడా సరిగా లేదని కోర్టులే తేల్చాయన్నారు. ఆధారాలు లేని కేసులతో కోర్టులకు వెళ్తే స్టే ఇస్తున్నారని స్పష్టం చేశారు. కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా వైకాపా ప్రభుత్వం అమలు చేయట్లేదని ఆరోపించారు. పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగించాలని కోర్టులు చెప్పినా ప్రభుత్వం వినలేదన్నారు. కోర్టులు, న్యాయమూర్తులపై వైకాపా నేతల వ్యాఖ్యలు సరికాదని ఎంపీ కనకమేడల వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి : వృథాగా పోతున్న వరద జలాలను ఒడిసి పట్టాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.