వైకాపా ఎంపీల తీరుపై తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఎంపీలు మాట్లాడటం లేదన్నారు. శ్రీకాకుళం జీజీహెచ్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్లమెంటులో రకరకాల సమస్యలపై సభ్యులు మాట్లాడుతుంటే.. గుంపులో గోవిందు లాగా వైకాపా ఎంపీలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకే తప్ప.. వైకాపాకు చిత్తశుద్ధి లేదన్నారు. వైకాపా ఎంపీలంతా రెండేళ్లుగా ఏం చేశారని ప్రశ్నించారు. ఇన్ని రోజుల తరువాత ఎందుకు నిద్ర లేచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ రఘరామకృష్ణరాజు అంశం కోసం డ్రామా ఆడుతున్నారని దుయ్యబట్టారు. తెదేపా చిత్తశుద్ధి ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి
Viveka murder case: వివేకా హత్య కేసులో నా ప్రమేయం లేదు: ఎర్ర గంగిరెడ్డి