సీఎం జగన్ దిల్లీ పర్యటన (cm jagan delhi tour)పై తెదేపా ఎంపీ కనకమేడల(tdp mp kanakamedala) ప్రశ్నల వర్షం గుప్పించారు. 3 రాజధానులు, కర్నూలులో హైకోర్టు, రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చర్చించామని చెబుతున్నారని.. కానీ ఈ అంశాలన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యలను ఎవరు, ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని.. ఇప్పటికే కేంద్ర స్పష్టం చేసిందని గుర్తు చేశారు. పార్లమెంట్ లోపల, వెలుపల భాజపా స్పష్టంగా చెప్పిందన్నారు. విశాఖ ఉక్కు అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దిష్టమైన కార్యాచరణ లేదని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:
CM Jagan Delhi Tour: ముగిసిన సీఎం దిల్లీ పర్యటన.. రాష్ట్రానికి తిరుగు పయనం