విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి చక్కదిద్దేందుకు కేంద్రం ముందుకు రావాలని.... తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. ప్రత్యేక హోదా అమలు చేయలేదని....అమరావతికి ప్రధాని శంకుస్థాపన చేసినా నిధులు కేటాయించలేదని రాజ్యసభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్టాలకు తోడు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం మరింత దారుణమని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకూ సరిగా నిధులు అందడం లేదని ఆరోపించారు.
వైకాపా ఎంపీలపై ఆగ్రహం
'రాష్ట్రాన్ని నాశనం చేసిన మీరు నా ప్రసంగాన్ని అడ్డుకుంటారా?' అని వైకాపా ఎంపీలపై కనకమేడల మండిపడ్డారు. ఆర్థిక బిల్లుపై రాజ్యసభలో ఆయన మాట్లాడుతుండగా వైకాపా ఎంపీలు అడ్డుతగలటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే..ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏమీ చేయలదని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: