రైతుల సమస్యలు చెప్పేందుకే చలో అసెంబ్లీ తలపెట్టామనన్న గల్లా ... రాళ్లు వేశానని తనపై కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను రక్షించేందుకు ప్రయత్నించిన కొందరు మహిళలు గాయపడ్డారని వివరించారు. పోలీసులు బలవంతంగా లాక్కెళ్లడంతో తాను గాయపడ్డానని వివరించారు. పోలీసుల ప్రవర్తన మారాలన్న జయదేవ్.. పోలీసుల వైఖరిపై ప్రధాని, హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
'వైకాపా ప్రభుత్వం వచ్చాక మండలి 31 బిల్లులను ఆమోదించింది'
5 కోట్లమంది ప్రజలను వైకాపా ప్రభుత్వం అనేక కష్టాలు పెట్టిందని ఎంపీ కనకమేడల ఆరోపించారు. మండలి అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రత్యేక వ్యవస్థ అన్న కనకమేడల...వైకాపా ప్రభుత్వం వచ్చాక మండలి 31 బిల్లులను ఆమోదించిందని గుర్తు చేశారు. 2 బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపితే జగన్ మనసుకు బాధ కలిగిందా? అని ప్రశ్నించారు. మండలి వ్యవహారాలు చర్చించే అధికారం అసెంబ్లీకి లేదన్నారు. మండలి రద్దు ద్వారా జగన్ బీసీలకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. మండలిని ఎందుకు రద్దు చేస్తున్నారో స్పష్టంగా కారణం చెప్పాలని డిమాండ్ చేశారు.
3 రాజధానులకు ఎంత ఖర్చు అవుతుంది..?
అమరావతి అంశం చాలా ముఖ్యమైందని తెదేపా ఎంపీలు అన్నారు. రాష్ట్రానికి మధ్యలోనే రాజధాని ఉండాలని గతంలో జగన్ చెప్పారన్న జయదేవ్... రాజధాని మారుస్తామని వైకాపా మ్యానిఫెస్టోలో పెట్టలేదన్నారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని వైకాపా నేతలు పలుసార్లు చెప్పారని.. రాజధాని మార్పునకు ప్రజల ఆమోదం లేదన్నారు. రాష్ట్రంలో 8 నెలలుగా అన్నిరకాల పనులు నిలిపివేశారని ఎంపీ తెలిపారు. 3 రాజధానులు అనేదాన్ని తొలిసారి వింటున్నామని అన్నారు.
'వయసులో ఉన్న సీఎం కాదు... విజన్ ఉన్న సీఎం కావాలి'
నరేగా నిధుల బకాయిలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్రం, హైకోర్టు చెప్పినా నరేగా నిధులు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. కాంట్రాక్ట్ బిల్లులు ఇవ్వని ప్రభుత్వం...ఆ బిల్డింగ్లకు మాత్రం రంగులు వేసుకుందని అన్నారు. వయసులో ఉన్న సీఎం కాదు... విజన్ ఉన్న సీఎం కావాలని ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
1,500 కోట్లు ఖర్చు చేస్తే...
అమరావతి ఎలా కట్టాలనే దానిపై తెదేపాకి ప్రణాళిక ఉందని తెదేపా ఎంపీలు అన్నారు. అమరావతి కోసం గతప్రభుత్వం రూ.9 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఇంకా రూ.1,500 కోట్లు ఖర్చు చేస్తే అమరావతిలో అన్నీ పూర్తవుతాయని వివరించారు. రాజధానిని విశాఖ, కర్నూలుకు తీసుకెళ్తే ఎంతవుతుందో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలా న్యాయం చేస్తారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.