ETV Bharat / city

జగన్ ప్రిజనరీ.. చంద్రబాబు విజనరీ - లోకేశ్

author img

By

Published : Mar 25, 2022, 1:49 PM IST

Updated : Mar 25, 2022, 7:09 PM IST

TDP MLCs on jagan: చట్ట సభల్లో తమ గొంతు నొక్కినా.. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తప్పిదాలను వదిలిపెట్టేది లేదని అన్నాకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్. ఈ నెల 29 నుంచి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ప్రజాక్షేత్రంలోకి పెద్ద ఎత్తున తరలి వస్తారని లోకేశ్​ వెల్లడించారు.

TDP MLCs commented on CM Jagan
ఎమ్మెల్సీ నారా లోకేశ్​

TDP MLCs on jagan: పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 29 నుంచి.. ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడతామని తెదేపా నేత నారా లోకేశ్​ స్పష్టం చేశారు. చట్ట సభల్లో తమ గొంతు నొక్కినా.. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తప్పిదాలను నిలదీస్తామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ న్యాయవ్యవస్థపై దాడికి దిగలేదన్న లోకేశ్.. పదోతరగతి తప్పిన మూర్ఖపు ఆలోచనతో న్యాయ వ్యవస్థపైనే జగన్ రెడ్డి దాడికి దిగారని ధ్వజమెత్తారు. భూ త్యాగాలు చేసిన రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. అమరావతిలో నిర్మాణాలు పూర్తైన భవనాలకు జగన్ రెడ్డి ప్రాంరంభోత్సవాలు కూడా చేయలేదని దుయ్యబట్టారు.

TDP MLCs on jagan: 40 గంటల పాటు సాగిన అసెంబ్లీలో.. సారా మరణాలపై 40 నిమిషాలు పాటు చర్చించలేరా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులకు గుంతలు పూడ్చలేని సీఎం.. 3 రాజధానులు కడతారా..? అంటూ ఎద్దేవా చేశారు. ప్రిజనరీకి.. విజనరీకి ఉన్న తేడా ప్రజలు గుర్తించాలని లోకేశ్.. ప్రిజనరీ వ్యవస్థల నాశనం గురించి ఆలోచిస్తే.. విజనరీ భావి తరాల బాగు కోరుకుంటాడని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రిజనరీ అయితే చంద్రబాబు విజనరీ అన్నారు.

TDP MLCs on jagan: జగన్ విశాఖ వెళ్లి కూర్చుంటే మాకు మరిన్ని సీట్లు పెరుగుతాయన్నారు. ఇప్పటికే విశాఖలో అరాచకం.. భూకబ్జాలు పెరిగాయని... జగన్‌ విశాఖ వెళ్తే అరాచకాలు మరింతగా పెరుగుతాయని ఆరోపించారు. విజయసాయి దెబ్బకు విశాఖలో అందరూ భయపడుతున్నారని... రేపు సీఎం జగన్‌ విశాఖ వెళ్తే ఇంకా భయపడతారని అన్నారు. 1200 గజాల భూమి ఉన్న ప్రతి విశాఖ వాసి గజగజలాడుతున్నాడని చెప్పారు.

TDP MLCs on jagan: పరిపాలన కేంద్రీకరణ.. అభివృద్ధి వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి అని స్పష్టం చేశారు. పరిపాలనా వికేంద్రీరణ అంటే పరిపాలనా విధ్వంసమే జరుగుతుందని హెచ్చరించారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది తామేనన్నారు. పరిపాలన ఒకేచోట ఉంచి.. అన్ని జిల్లాల అభివృద్ధే తమ లక్ష్యమని తెలిపారు.

TDP MLCs on jagan: పీపీఏల రద్దుతో ఏపీలో పెట్టుబడులకు ముందుకు రావట్లేదని... తమ ఒప్పందాలు కొనసాగించి ఉంటే విశాఖ రూపురేఖలే మారేవని అన్నారు. అభివృద్ధి చేయలేకే జగన్‌ 3 రాజధానుల నినాదం ఎత్తుకున్నారని విమర్శించారు. ఆరోజు అమరావతికి మద్దతు పలికి ఇవాళ కాదనడం మోసం కాదా? అని ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారితే ప్రజల పరిస్థితేంటని ప్రశ్నించారు.

ఎమ్మెల్సీలు: సమావేశాల చివరి రోజు కూడా అసెంబ్లీలో నాటుసారా మరణాలపై చర్చకు అవకాశం ఇవ్వలేదని తెదేపా ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల తాళిబొట్లు తెగిపోయాయని సభలో తాళిబొట్ల ప్రదర్శన పెట్టినా... చర్చ చేపట్టకపోగా తమపై ఎదురుదాడికి దిగారని ఆరోపించారు. భర్తల్ని కోల్పోయిన మహిళల బాధ తెలపాలనే... తాళిబొట్లు ప్రదర్శించామన్నారు. వైకాపా ఎమ్మెల్సీలు తమ చేతిలో తాళిబొట్లు లాక్కుని నెలకేసికొట్టి... తిరిగి తామే వారిని అవమానించామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 42మంది ప్రాణాలు ఎందుకు పోయాయో ప్రభుత్వం చట్టసభల్లో సమాధానం చెప్పలేదని దుయ్యబట్టారు. పులివెందులలో కల్తీసారా బయటపడినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత సీఎం జగన్​పై ఉందని గుర్తుచేశారు.

ఇదీ చదవండి: నాటుసారా మరణాలపై తెదేపా నేతల నిరసన.. పరిహారం ఇవ్వాలని డిమాండ్​

Last Updated : Mar 25, 2022, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.