ETV Bharat / city

'ఇసుక రీచ్​ల ప్రైవేటీకరణ...2లక్షల కుటుంబాలు రోడ్డున..​' - ఇసుక రీచ్​ల ప్రైవేటీకరణపై బుద్ధా కామెంట్స్

రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రీచ్​లను ప్రైవేటీకరించటం వల్ల 2 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు అన్నారు.

TDP MLC Buddha Naga jagadeesh
తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు
author img

By

Published : Mar 24, 2021, 8:34 PM IST

రాష్ట్రంలో ఇసుక రీచ్​లను ప్రైవేటీకరించటం వల్ల 2 లక్షల కుటుంబాల ఉపాధికి గండి పడిందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు ధ్వజమెత్తారు. 2వేల మంది ఏపీఎండీసీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ఉపాధి కోల్పోతున్నారని చెప్పారు. అందరికీ తెదేపా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసినందుకు ఇప్పటికే 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని బుద్ధా ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 మంది ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 1,200 రూపాయలు ఉండే ట్రాక్టర్ ఇసుక... ఇవాళ 7 వేల రూపాయలు అయ్యిందని ఆక్షేపించారు. జగన్ బినామీ సంస్థకు టెండర్ కట్టబెట్టిన 24 గంటల్లోనే టన్ను ఇసుక ధర వంద రూపాయలు పెంచి హ్యాండ్లింగ్, రవాణా ఛార్జీలు అదనంగా మోపారని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:

'బంగారం లాంటి విశాఖ ఉక్కును అమ్మే యత్నాలు సరికాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.