ETV Bharat / city

' పోలీసులూ యూనిఫామ్ తీసేసి వైకాపా దుస్తులు ధరించండి'

స్థానిక ఎన్నికల్లో వైకాపా చేస్తున్న దౌర్జన్యాలపై హైకోర్టులో పిటిషన్లు వేశామని.. తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. ఎన్నికల రీషెడ్యూల్ కోరుతూ వ్యాజ్యం దాఖలు చేశామని తెలిపారు.

tdp mlc ashok babu criticizes ycp government
అశోక్ బాబు
author img

By

Published : Mar 12, 2020, 2:23 PM IST

రాష్ట్రంలో పోలీసులు ఖాకీ యూనిఫామ్ తీసేసి వైకాపా దుస్తులు ధరించటం మంచిదని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎద్దేవాచేశారు. వైకాపా అరాచకాలపై హైకోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు. 12 జడ్పీటీసీలు, 470 ఎంపీటీసీల్లో ఎన్నికల రీషెడ్యూల్ కోరుతూ వ్యాజ్యం వేశామన్నారు. నామినేషన్లు వేసేటప్పుడు.. పరిశీలన సమయంలోనూ వైకాపా నేతలు, కార్యకర్తలు పత్రాలు చించేసే దుస్థితి నెలకొందని అశోక్‌బాబు మండిపడ్డారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తెదేపా నేతలు మాచర్ల వెళ్లారని హోంమంత్రి అబద్దాలు చెప్తున్నారన్న ఆయన.. తాము పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు నిరూపిస్తే.. హోంమంత్రి రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు.

ఇవీ చదవండి.. స్థానిక ఎన్నికల్లో వైకాపా దౌర్జన్యాలకు అంతులేకుండా పోతోంది'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.