విద్యుత్ కష్టాలు తగ్గించేందుకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించడం మోసమని తెదేపా నేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. సున్నావడ్డీ మాదిరే.. ఉచిత విద్యుత్ ను నీరుగార్చుతున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడితే రైతులను అప్పుల ఊబిలోకి దించటమేనని అన్నారు. ఈ నిర్ణయంతో ఆత్మహత్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. ఉచిత విద్యుత్ విధానాన్ని మార్చడం వల్ల చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రైతులందరికీ తెదేపా అండగా ఉంటుందని తేల్చిచెప్పారు.
ఉచిత విద్యుత్‌ను నీరుగార్చేందుకే నగదు బదిలీ: రామానాయుడు
వైకాపా ప్రభుత్వంపై టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉచిత విద్యుత్‌ను నీరుగార్చేందుకే నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంపై తెదేపా పోరాడుతుందని...రైతులకు అండగా ఉంటుందని చెప్పారు.