అమ్మఒడి పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులను ప్రభుత్వం మోసం చేస్తోందని... రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ప్రతీ విద్యార్థికి రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చి... ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నా తల్లి ఖాతాలో కేవలం రూ.15వేలు మాత్రమే జమ చేస్తామని ప్రకటించి మాట తప్పుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 83 లక్షల మంది విద్యార్థులు ఉంటే... కేవలం 42 లక్షల మంది తల్లులకు మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తున్నారని ఆరోపించారు. మాటతప్పను మడమతిప్పను అంటే ఇదేనా... అని నిలదీశారు. అమ్మఒడి లబ్ధిదారుల నుంచి కూడా జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి : అమరావతిపై 'చర్చా' కార్యక్రమం: పలు తీర్మానాలు ఆమోదం