రాజధాని అమరావతి ప్రాంతంలో తెదేపా నేతల బృందం పర్యటిస్తోంది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో నేతలు బయల్దేదారు. పార్టీ నాయకులు రామానాయుడు, నారాయణ, దేవినేని ఉమ, అశోక్‌బాబుతో పాటు ఇతర నేతలు బృందంలో ఉన్నారు. నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించారు. తెదేపా హయాంలో రాజధాని ప్రాంతంలో చేపట్టిన పనులు, ప్రణాళికను పరిశీలించారు.
ఖర్చు వివరాలు విడుదల
చంద్రబాబుకు పేరొస్తుందనే అమరావతి నిర్మాణాన్ని వైకాపా ఆపేసిందని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఐదేళ్లలో రాజధానిలో ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదని...మంత్రులు చేసిన విమర్శలను తిప్పికొట్టడమే లక్ష్యంగా రాజధాని ప్రాంతంలో పర్యటించిన నేతలు... కట్టడాలను పరిశీలించి పనుల పురోగతి, అందుకు చేసిన ఖర్చుల వివరాలను విడుదల చేశారు.
ఇదీ చదవండి: