తెదేపా అధినేత చంద్రబాబుకు పేరొస్తుందన్న అక్కసుతోనే రాజధాని అమరావతి నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆపేసిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆ పార్టీ నేతలు... ఐదేళ్లలో ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదని మంత్రులు చేసిన విమర్శలను తిప్పికొట్టారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల కోసం 12 టవర్లుగా నిర్మించిన 288 క్వార్టర్లను మీడియాకు చూపించారు. అమరావతి గ్రాఫిక్స్ అంటూ పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజధానికి కులం అంటగట్టి నిర్మాణాలను ఆపేశారని... వారి చర్యతో కూలీలు పనులు దొరక్క అల్లాడుతున్నారని ఆవేదన చెందారు. ఈ ఐదు నెలల కాలంలో ఎంత మేర అవినీతిని బయటికి తీశారని నేతలు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: