ETV Bharat / city

నూతన ఇసుక విధానంపై తెదేపా నిరసన ర్యాలీ - ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఇసుక కొరత, నూతన ఇసుక విధానంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన నిరసన ర్యాలీ నిర్వహించారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి కాలినడకన వెళ్లిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఇసుక ధరల పెంపు, భవన కార్మికుల కష్టాలు వివరిస్తూ.. వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇసుక కృత్రిమ కొరత సృష్టించిందని ఆరోపించారు. పనుల్లేక భవన నిర్మాణ కార్యకర్తలు చేసుకున్న ఆత్మహత్యలవి ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు.

tdp leaders protest on sand issue in thadepalli guntur district

author img

By

Published : Dec 2, 2020, 9:59 AM IST

నూతన ఇసుక విధానంపై తెదేపా నిరసన ర్యాలీ

వైకాపా ఇసుక దోపిడీకి అడ్డుపడుతుందనే రాష్ట్రంలో ఉచిత ఇసుకను అమలు చేయట్లేదని తెదేపా నేతలు ఆరోపించారు. నాణ్యమైన ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ.. నాసిరకం ఇసుకను రాష్ట్రంలో పంపిణీ చేస్తున్నారని దుయ్యబట్టారు. సొంత మనుషులకు ఇసుక కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకే నూతన విధానాన్ని జాప్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఇసుక కొరత, నూతన ఇసుక విధానంపై తెదేపా నిరసన చేపట్టింది. సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. తాపీ పనిముట్లు, బంగారం కొలిచే త్రాసు, ఇసుక మూటలతో ర్యాలీ నిర్వహించారు.

ఇసుక తట్టను తలపై పెట్టుకుని చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కొల్పోయారంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. గతంలో ఉచితంగా ఉన్న ఇసుక.. నేడు భారంగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక సమస్య వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 లక్షల మంది పరిస్థితి దుర్భరంగా మారిందని నేతలు ధ్వజమెత్తారు. కొత్త విధానం ప్రకటించకుండానే తెదేపా అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వం.. కృత్రిమ కొరత సృష్టించిందని మండిపడ్డారు.

పనుల్లేక ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. తాము తెచ్చిన ఇసుక విధానం అవినీతి విధానమని ప్రభుత్వమే పత్రికల్లో ప్రకటనలిచ్చి మరీ ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. 18నెలలుగా జరిగిన ఇసుక దోపిడీ జే-ట్యాక్స్ కి వెళ్ళిందని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని నిర్వీర్యం చేయడంతో పాటు రాష్ట్రంలో ఎవ్వరూ ఇళ్లు కట్టుకోలేని దుస్థితి తీసుకొచ్చారని నేతలు విమర్శించారు.

ఇదీ చదవండి: పేదల ఇళ్ల నిర్మాణానికి కనీసం 2 సెంట్లు ఇవ్వాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.