ETV Bharat / city

'ప్రజలపై కాకపోతే.. లోటస్​పాండ్​పై భారం పడుతుందా..?'

సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై తెదేపా నేతలు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. న్యాచురల్ గ్యాస్​పై వ్యాట్ పెంచితే భారం ప్రజలపై కాకపోతే... లోటస్​పాండ్​పై పడుతుందా అని ప్రశ్నించారు. పెంచిన పన్నంతా ఇడుపులపాయ నేల మాలిగల్లోంచి తీసి కడుతున్నారా..? అని నిలదీశారు.

TDP Leaders Fires on Jagan Over VAT Hike
'ప్రజలపై కాకపోతే.. లోటస్​పాండ్​పై భారం పడుతుందా..?'
author img

By

Published : Sep 14, 2020, 4:51 AM IST

న్యాచురల్ గ్యాస్​పై వ్యాట్ పెంచితే భారం ప్రజలపై కాకపోతే... లోటస్​పాండ్​పై పడుతుందా అని గన్నేరుపప్పు జగ్గుని అడిగి విజయసాయి చెప్పాలని... తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. సంక్షేమ కార్యక్రమాల అమలు చేస్తున్నాం కాబట్టి పన్నులు పెంచుతున్నాం అని... నిసిగ్గుగా ప్రకటించటం గన్నేరుపప్పు జగ్గూకే చెల్లిందని దుయ్యబట్టారు. లోకేశ్ దమ్మున్న మగాడిలా వందమంది జర్నలిస్టుల మధ్య నిలబడి మాట్లాడుతూ.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి కానీ వెళ్లరని అయ్యన్న స్పష్టం చేశారు.

గన్నేరుపప్పు జగ్గూను... 10 మంది జర్నలిస్టుల ముందు నిలబెట్టి మాట్లాడించి.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం వీసారెడ్డి చెప్పించాలని సవాల్ విసిరారు. దోపిడీనందు జగన్ దోపిడీ, సాయి రెడ్డి గారడీ వేరయా... అని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రయాణికుడిపై భారం పడదనటం... ఇసుక ధర పెంచి ఇల్లు కట్టుకునే వారిపై భారం పడదనటం... న్యాచురల్ గ్యాస్ ధర పెంచి భారం ప్రజలపై ఉండదంటే... మరి పెంచిన పన్నంతా ఇడుపులపాయ నేల మాలిగల్లోంచి తీసి కడుతున్నారా..? అని బుద్దా ప్రశ్నించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.