రాజధాని విషయంలో సీఎం జగన్ మాట తప్పి, మడమ తిప్పారని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి విమర్శించారు. ఆయన వైఖరితో ఏపీ విశ్వసనీయత ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం తెచ్చిన మూడు రాజధానుల చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లదని స్పష్టం చేశారు. సీఆర్‌డీఏ, రైతులకు మధ్య ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదన్నారు.
అమెరికాలోని ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలోని హెల్పర్స్ ఫౌండేషన్ ‘ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి సంకెళ్లకు ఏడాది’ పేరుతో నిర్వహించిన వెబినార్‌లో వారు మాట్లాడారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు రోడ్డున పడాలా? అని అమరావతి మహిళా ఐకాస నేత జయలక్ష్మి ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి నిర్మాణానికి అంగీకరించిన జగన్ అధికారంలోకి వచ్చాక రాజధానిని ఎందుకు మూడు ముక్కలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: