విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సీఎం జగన్ ఆమోదంతోనే ఒప్పందం జరిగిందని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. కేంద్రమంత్రి స్వయంగా చెప్పడంతో జగన్ నిజస్వరూపం బట్టబయలైందన్నారు. ప్రైవేటుపరం చేసి వాటాల కోసం యత్నించడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
ప్రత్యేక విమానంలో విశాఖ వరకూ వచ్చి స్వామీజి కాళ్లుమొక్కిన సీఎం జగన్కు.. స్టీల్ ప్లాంట్ వరకూ వెళ్లి కార్మికులకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చే తీరిక లేదా అని అయ్యన్నపాత్రుడు నిలదీశారు. ప్రైవేటీకరణకు సూత్రధారి విజయసాయిరెడ్డే పాదయాత్ర చేస్తాననడం ఆశ్చర్యకరమని అన్నారు. విజయసాయిరెడ్డి.. చేతనైతే సీఎంతో కలిసి దిల్లీలో పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. చీకటి ఒప్పందం బయటపడుతుందనే ప్రధాని వద్దకు వెళ్లలేకపోతున్నారా అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.
పోస్కోతో ఒప్పందం రద్దయ్యే మార్గం చెప్పాలి..
"స్టీల్ ప్లాంట్ ప్రవేటుపరం కాకుండా చూడటంవల్ల కాదని సీఎం జగన్ చెప్తుంటే.. విజయసాయిరెడ్డి తాను పాదయాత్ర చేస్తా, ఎంతవరకైనా వెళ్తా అని ప్రగల్భాలు పలకడం రాష్ట్ర ప్రజలను మోసగించడమే. ఎన్నడూ నిజం చెప్పని విజయసాయిరెడ్డి పోస్కోతో ఒప్పందం రద్దయే మార్గం చెప్పాలి." వర్ల రామయ్య ట్వీట్
-
స్టీల్ ప్లాంట్ ప్రవేటు పరం కాకుండా చూడడం మనవల్ల కాదని ముఖ్యమంత్రి సెలవిస్తుంటే,ఈ చర్యకు సూత్రధారి A2 విజయసాయిరెడ్డి,తాను పాదయాత్ర చేస్తా,ఎంతవరకయినా వెళ్తా అని ప్రగల్భాలు పలకడం రాష్ట్ర ప్రజలను మోసగించడమే. ఎన్నడూ నిజం చెప్పని విజయసాయిరెడ్డి పోస్కోతో ఒప్పందం రద్దయే మార్గం చెప్పాలి
— Varla Ramaiah (@VarlaRamaiah) February 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">స్టీల్ ప్లాంట్ ప్రవేటు పరం కాకుండా చూడడం మనవల్ల కాదని ముఖ్యమంత్రి సెలవిస్తుంటే,ఈ చర్యకు సూత్రధారి A2 విజయసాయిరెడ్డి,తాను పాదయాత్ర చేస్తా,ఎంతవరకయినా వెళ్తా అని ప్రగల్భాలు పలకడం రాష్ట్ర ప్రజలను మోసగించడమే. ఎన్నడూ నిజం చెప్పని విజయసాయిరెడ్డి పోస్కోతో ఒప్పందం రద్దయే మార్గం చెప్పాలి
— Varla Ramaiah (@VarlaRamaiah) February 18, 2021స్టీల్ ప్లాంట్ ప్రవేటు పరం కాకుండా చూడడం మనవల్ల కాదని ముఖ్యమంత్రి సెలవిస్తుంటే,ఈ చర్యకు సూత్రధారి A2 విజయసాయిరెడ్డి,తాను పాదయాత్ర చేస్తా,ఎంతవరకయినా వెళ్తా అని ప్రగల్భాలు పలకడం రాష్ట్ర ప్రజలను మోసగించడమే. ఎన్నడూ నిజం చెప్పని విజయసాయిరెడ్డి పోస్కోతో ఒప్పందం రద్దయే మార్గం చెప్పాలి
— Varla Ramaiah (@VarlaRamaiah) February 18, 2021
ఇదీ చదవండి: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై పాదయాత్ర: విజయసాయి