ETV Bharat / city

'ఆర్థిక చక్రాన్ని రివర్స్ చేసి... ఆదాయ మార్గాలకు గండికొట్టారు'

తెలుగుదేశం పార్టీ సింగపూర్ నమూనా చేపడితే..... వైకాపా వెనిజులా నమూనా తెచ్చిందని ... యనమల రామకృష్ణుడు విమర్శించారు. పెట్టుబడులను తరిమేసి, ఆదాయాలను అడ్డుకొని, ఉపాధిని దెబ్బతీసి, ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి.... ప్రజలే తిరగబడి రోడ్లపైకి రావడమే వెనిజులా నమూనా అంటూ యనమల ఎద్దేవా చేశారు.

yanamala
author img

By

Published : Oct 12, 2019, 10:56 PM IST

4నెలల్లో ఏపీలో తలసరి ఆదాయం 17వేల రూపాయలు తగ్గినట్లు ప్రధానికి సీఎం జగన్‌ ఇచ్చిన వినతి పత్రమే బయటపెట్టిందని తెదేపా సీనియర్ నేత యనమల విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అధోగతికి తెచ్చారని....అది కనిపించకుండా చేసేందుకు మంత్రి బుగ్గన తాపత్రయపడుతున్నారని ఆక్షేపించారు. ఎక్సైజ్‌ ద్వారా వచ్చే ఆదాయం తప్ప అన్ని రంగాల రాబడి పడిపోయిందన్న యనమల... మద్యం రేట్లు పెంచేసి పేదల రక్తం పీల్చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మౌలిక వసతుల రంగాన్ని చావుదెబ్బతీశారని ఆరోపించారు. ఆర్థిక చక్రాన్నే రివర్స్ చేశారని... సామాన్యుడి ఆదాయ మార్గాలకు గండికొట్టారని యనమల ధ్వజమెత్తారు.

Intro:AP_ONG_21_26_NIRAVAHANA LO LENI TTD_ KALYANAMANDAPAM _AP10135

సెంటర్-- గిద్దలూరు
రిపోర్టర్ ---చంద్రశేఖర్
ప్రకాశం జిల్లా ,గిద్దలూరు పట్టణంలోని , పిడతల రంగారెడ్డి కాలనీలో 2 సంవత్సరాల క్రితం ప్రారంభించి 60 లక్షల వ్యయంతో టిటిడి వారు 6 కళ్యాణ మండపం నిర్మించారు. గత సంవత్సరం స్థానిక ఎమ్మెల్యే కళ్యాణ మండపం ప్రారంభించారు. కళ్యాణ మండపం ప్రారంభించి దాదాపు సంవత్సరం , ఇప్పటివరకు దాన్ని నిర్వహించే వారు కరువయ్యారు. ఇక్కడ బాధ్యతలు నిర్వహించే అధికారులు ఎవరూ లేరు శుభకార్యాలు నిర్వహించు కోవాలంటే ప్రజలు ఎవరిని సంప్రదించాలో అర్థం కాని పరిస్థితి . ఇటీవల కురిసిన వర్షాలకు మండపం చుట్టూ చిల్ల చెట్లు మొలచి ప్రజలు నడవడానికి ఇబ్బందిగా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే దీనిని ప్రజలకు అందుబాటులోనికి తీసుకుని వచ్చి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అవకాశం కల్పిస్తారని ఇక్కడి ప్రజలు ఆశిస్తున్నారు
బైట్స్:--- స్థానిక ప్రజలు

Body:AP_ONG_21_26_NIRAVAHANA LO LENI TTD_ KALYANAMANDAPAM _AP10135

Conclusion:AP_ONG_21_26_NIRAVAHANA LO LENI TTD_ KALYANAMANDAPAM _AP10135
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.