మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి జడ్జి రామకృష్ణకు ప్రాణహాని ఉందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. జడ్జి రామకృష్ణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గానికి చెందిన రామకృష్ణ పట్ల మంత్రి పెద్దిరెడ్డి కక్షగట్టారని ఆరోపించారు. రామకృష్ణకు ఏం జరిగినా పెద్దిరెడ్డి, సీఎం జగన్, డీజీపీలదే బాధ్యత అని అన్నారు.
జడ్జి రామకృష్ణపై దేశద్రోహం కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వమే రామకృష్ణకు బెయిల్ ఇప్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: