వివేకా హత్య కేసుపై గతంలో సీబీఐ విచారణ కోరిన జగన్ ... ఇప్పుడెందుకు వెనుకడుగు వేస్తున్నారని తెదేపా నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేదని జగన్ గతంలో పదేపదే వ్యాఖ్యానించడాన్ని ఆయన గుర్తుచేశారు. నమ్మకం లేదన్న పోలీసులు ఇప్పుడు జగన్‌కు ఆత్మీయులయ్యారా అని నిలదీశారు. సిట్‌పై నమ్మకం లేదన్న జగన్... సీఎం అయ్యాక మరో సిట్ వేశారని వర్ల రామయ్య తెలిపారు. సీబీఐకి ఇవ్వాలని నిన్న హైకోర్టులో వివేకా కుమార్తె పిటిషన్ వేశారన్న రామయ్య... రిట్ పిటిషన్‌లో సునీత వేదన జగన్‌మోహన్‌రెడ్డికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
ఇవాళ సీఎం జగన్.. హైదరాబాద్ రహస్య పర్యటనకు కారణాలేంటో చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. సునీతకు నచ్చజెప్పి రిట్ పిటిషన్ వెనక్కి తీసుకునేలా చేయడానికి వెళ్లారా? అంటూ ప్రశ్నలు గుప్పించారు. రిట్ పిటిషన్‌లో సునీత అనుమానితుల జాబితా ఇచ్చారన్న వర్ల రామయ్య.. సీబీఐకి దర్యాప్తునకు ఇస్తే ఎవర్ని అరెస్టు చేస్తారని భయమని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: