Pattabhiram: తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు భారీ అవినీతికి పాల్పడ్డారని, దీనిపై సీఎం సీబీఐతో విచారణ జరిపించాలని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ డిమాండు చేశారు. గతంలో తాను బయటపెట్టిన బదిలీకి వీలున్న హక్కుల (టీడీఆర్) బాండ్ల జాబితాలో తాజాగా మరొకటి చేరిందన్నారు. దీని ద్వారా ఎమ్మెల్యే కారుమూరి రూ.35 కోట్ల వరకు తినేశారని విమర్శించారు. డంపింగ్ యార్డు కోసమని 4,046 చదరపు మీటర్ల (దాదాపు 4,838 గజాలు) స్థలాన్ని రేలంగి గ్రామ సర్పంచి పులుపు అనిల్ కుమార్ నుంచి తణుకు పురపాలక సంఘం తీసుకుని... ఇందుకు బదులుగా 16,186 చదరపు మీటర్లకు (19,358 చదరపు గజాలు) టీడీఆర్ బాండు ఇచ్చిందని ఆరోపించారు.
Pattabhiram: సమాచార హక్కు చట్టం ద్వారా ఈ సమాచారం సేకరించామని చెప్పారు. అనిల్ కుమార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా వైకాపావారే అన్నారు. వీరంతా ఎమ్మెల్యే కారుమూరికి ముఖ్య అనుచరులు, బినామీలుగా ఉన్నారన్నారు. వారితో తణుకు పురపాలక సంఘానికి స్థలాన్ని ఇప్పించి తన బినామీ అనిల్ కుమార్‌కు రూ.35 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లను ఎమ్మెల్యే ఇప్పించారని ఆరోపించారు. ఇదంతా కారుమూరి సాగించిన అవినీతి వ్యవహారం కాదా? అని పట్టాభిరామ్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు.
ఇదీ చదవండి: