ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పారిశ్రామిక విధానంలో కొత్తగా ఏమి లేదని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా అచ్చంపేటలో మాట్లాడిన ఆయన...తెదేపా పాలనలో తీసుకొచ్చిన పారిశ్రామిక విధానంతో రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వచ్చాయని అన్నారు. పరిశ్రమలకు రాయితీలు ఇచ్చి ఇతర రాష్ట్రాల వైపు చూడకుండా తగిన వాతావరణం కల్పించిందని గుర్తు చేశారు. విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ సమ్మిట్ పేరుతో కార్యక్రమం నిర్వహించి.. రూ. 50 లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు తీసుకురావడం జరిగిందని చెప్పారు.
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం కేవలం...పెద్ద పరిశ్రమలకే అధిక ప్రాధాన్యత ఇచ్చిందని....చిన్న పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని ఆక్షేపించారు. సబ్సిడీలో విషయంలో కూడా చిన్న పరిశ్రమలను పక్కన పెట్టారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి