దొంగ, పోలీస్ ఒకటయ్యాక పరిషత్ ఎన్నికలు జరిపినా.. జరపకపోయినా ఒక్కటేనని మాజీమంత్రి జవహర్ ధ్వజమెత్తారు. ఎస్ఈసీ జగన్ బంట్రోతులా పని చేస్తోందని దుయ్యబట్టారు. జగన్ సంతృప్తి కోసమే కమీషనర్ పనిచేస్తూ... వచ్చిన రోజే షెడ్యూల్ ప్రకటించారని విమర్శించారు. 5 దఫాలుగా జరగాల్సిన ఎన్నికల్ని ఇంత తొందరపాటుగా ఒక్క రోజులో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కనీసం అన్ని పార్టీల నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుని ఉంటే వెన్నుముక ఉన్న ఎస్ఈసీ అనుకునే వాళ్లమని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: