ఇళ్లస్థలాల పేరుతో అవకతవకలు పాల్పడుతున్న జగన్ సర్కారు తీరుపై సీబీఐ విచారణ జరిపించాలని తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ మురికివాడలను తయారు చేసేలా ప్రభుత్వం విధానం ఉందని విమర్శించారు. రాజమహేంద్రవరంలో స్థలాల కేటాయింపునకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేనే ఫిర్యాదు చేసినా ప్రభుత్వం మౌనం వహించడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. భూ సేకరణ పేరుతో ధార్మిక సంస్థల ఆస్తులూ కొల్లగొడుతున్నారని ఆరోపించారు.
ఇవీ చదవండి: జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ