ETV Bharat / city

నాటి అభివృద్ధి పనులు మీ ఖాతాలో వేసుకుంటారా..? దేవినేని

author img

By

Published : Aug 11, 2020, 11:26 PM IST

వైకాపా ప్రభుత్వం సాగిస్తున్న ఆటవిక పాలన నుంచి కోర్టులే ప్రజలను కాపాడుతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తెదేపా హయాంలో చేసిన అభివృద్ధి పనులను కూడా వైకాపా ఖాతాలో వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

tdp-leader-devineni-uma-maheswara-rao
tdp-leader-devineni-uma-maheswara-rao

రాష్ట్రంలో సాగుతున్న రాక్షస, ఆటవిక పాలన నుంచి న్యాయస్థానాలే ప్రజలను కాపాడుతున్నాయని మాజీమంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇచ్చే జీవోలు న్యాయ సమీక్షలో నిలవకపోయినా, పాలకుల వైఖరి మారడం లేదని ఆక్షేపించారు.

విశాఖపట్నంలో కొట్టేసిన 32వేల ఎకరాలను అమ్ముకోవడానికి అక్కడ రాజధాని అంటున్నారు తప్ప, ప్రజలను ఉద్దరించడానికి కాదని దేవినేని ఉమ ఆరోపించారు. ముఖ్యమంత్రి ఒక్క కరోనా ఆసుపత్రినైనా సందర్శిస్తే.. వాస్తవాలు తెలుస్తాయని స్పష్టంచేశారు. క్వారంటైన్ కేంద్రాల్లో పెడుతున్న 500 రూపాయల భోజనం... మంత్రులు తిని, ఎలా ఉందో చెప్పాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. విజయవాడ ఫ్లైఓవర్ తామే కట్టామని చెబుతున్నారన్న ఆయన... రేపు పోలవరం, పట్టిసీమ కూడా తామే పూర్తి చేశామని చెప్పుకుంటారేమోనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం ఎందుకు నిలిపేసిందని నిలదీశారు.

ఇదీ చదవండి

విద్యుత్ పొదుపుపై ఇంధనశాఖ చర్యలు..ప్రత్యేక విభాగాలు ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.