Ex Minister Devineni Uma Fires on Minister Anil Kumar: పోలవరం ప్రాజెక్టు 2021 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామన్న మంత్రి అనిల్ ప్రకటన ఏమైందని మాజీ మంత్రి దేవినేని ఉమా నిలదీశారు. సోషల్ మీడియాలో, మీడియాలో జరిగే చర్చకు మంత్రి అనిల్ ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. మీడియా సంస్థలను తిట్టి, పోలవరం విషయం నుంచి తప్పించుకోలేరని మండిపడ్డారు. కేంద్రం నుంచి వచ్చిన రూ.4 వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు.
Devineni Uma On Polavaram Project: గడిచిన 30 నెలల్లో పోలవరం నిర్మాణ పనులకు ఎంత ఖర్చు అయ్యిందో చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన నిధుల్లో పునరావాసానికి ఎంత ఖర్చు పెట్టారని నిలదీశారు. 2020 జూన్ నాటికి 20 వేల మందికి ఇళ్లు కడతామన్నారని గుర్తు చేసిన దేవినేని.. అవి ఎక్కడ కట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. కడపలో ప్రాజెక్టులు కొట్టుకుపోతుంటే.. జనాలను కాపాడలేని సీఎం ఎందుకని ఆగ్రహం వ్యక్తంచేశారు. అఖండ సినిమా డైలాగుల దెబ్బకు.. వైకాపాకు మైండ్ బ్లాక్ అయ్యిందని ఎద్దేవా చేశారు. అందుకే ఎదో కారణం చెప్పి సినిమా థియేటర్లు సీజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
'పోలవరం ప్రాజెక్టు డిసెంబరు నాటికి పూర్తి చేస్తామన్న మంత్రి అనిల్ ప్రకటన ఏమైంది..? కేంద్రం నుంచి వచ్చిన రూ.4 వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు? 30 నెలల్లో పోలవరం పనులకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలి. 2020 జూన్‌కు 20 వేల మందికి ఇళ్లు కడతామన్నారు? కట్టారా? 'అఖండ' డైలాగుల దెబ్బకు వైకాపాకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఏదో సాకుతో అఖండ ఆడుతున్న థియేటర్లు సీజ్ చేస్తున్నారు' - దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి
ఇదీ చదవండి:
Local body MLCs in AP: ఎమ్మెల్సీలుగా 11 మంది వైకాపా అభ్యర్థులు.. ఈసీ నోటిఫికేషన్