ముఖ్యమంత్రి జగన్ తనపై ఉన్న కేసుల మాఫీ కోసం పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. పోలవరం కోసం తెదేపా ప్రభుత్వం ఖర్చు పెట్టిన రూ. 1850 కోట్ల చెక్ తీసుకురావటానికి ఏం సంతకాలు పెట్టారని నిలదీశారు. పోలవరాన్ని ముంచేందుకే 22మంది ఎంపీ సీట్లు గెలిచారా..? అని ప్రశ్నించారు.
ప్రతిపక్షంలో ఉండి పోలవరంపై వైకాపా రాసిన చెత్త రాతల వల్ల 30వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని దుయ్యబట్టారు. పోలవరానికి జరుగుతున్న అన్యాయం నుంచి మీడియా దృష్టిని మళ్లించేందుకే గీతం కట్టడాలు ధ్వంసం చేశారని విమర్శించారు. పోలవరం కట్టడమంటే పబ్జీ ఆడటం, ఐపీఎల్ బెట్టింగ్లు కాసినంత తేలిక కాదని ఎద్దేవా చేశారు. పోలవరంపై తొలిసారి గంటసేపు సమీక్షించిన సీఎం ఏం నిర్ణయం తీసుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి