సీఎం జగన్‌కు కరోనా కంటే... ఎన్నికల కమిషనర్‌ను తొలగించటం, కొంతమంది అధికారులను వేధించటం తప్ప మరో ధ్యాస లేదని మాజీ మంత్రి, తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. పేదల జీవనోపాధికి ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు. కరోనాపై పోరాటంలో ముందున్న డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పాత్రికేయులకు బీమా పాలసీ ఇవ్వాలని కోరారు. కొవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మద్యం దుకాణాలను నిలుపుదల చేయాలని సూచించారు.
ఇదీ చదవండి: