ఇళ్ల స్థలాలకు అవసరమైన భూసేకరణలో ప్రభుత్వం.... హైకోర్టు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించిందని తెదేపా అధికార ప్రతినిధి చెంగల్రాయుడు ఆరోపించారు. ఇళ్లపట్టాల పంపిణీలో ప్రభుత్వం చేసినంత ఆర్భాటం, వాస్తవంలో కనిపించడం లేదని విమర్శించారు. స్థలాలు పొందిన వారిలో సంతృప్తి కనిపించడం లేదన్నారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పడు పేదలకు ఎంత స్థలం ఇచ్చారు.. ఇప్పుడు జగన్ ఎంత ఇస్తున్నాడో చెప్పాలని నిలదీశారు. 15లక్షల ఇళ్లను కట్టిస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి ముందు తెదేపా హయాంలో ప్రారంభమైన 2లక్షల ఇళ్లను పూర్తిచేసి పేదలకు ఇస్తే మంచిదని సూచించారు.
గత ప్రభుత్వంలో అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్న వారికి చెల్లించాల్సిన 4వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించని జగన్, కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తారంటే ప్రజలు నమ్ముతారా అని ఎద్దేవా చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో జరిగిన రూ.6,500కోట్ల అవినీతి వ్యవహారం తేలాలంటే ముఖ్యమంత్రి తక్షణమే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించి అసలు దోపిడీదారులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి