ETV Bharat / city

ఎంపీ మాధవ్ వీడియో కేసులో.. ఎస్పీ చదివిన స్క్రిప్ట్​ అక్కడిదే - ఎంపీ మాధవ్ వీడియో వివరాలు వెల్లడించిన ఎస్పీ

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెదేపా నేత బొండా ఉమా అన్నారు. ఈ కేసును దారి మళ్లించేందుకు ఎస్పీ ఫకీరప్ప పొంతనలేని మాటలు మాట్లాడారని ఆరోపించారు. వీడియో నిజమైనదా? కాదా? అని తేల్చే సాంకేతికత హైదరాబాద్ లో ఉందని అన్నారు.

bonda uma
bonda uma
author img

By

Published : Aug 10, 2022, 7:30 PM IST

ఎంపీ గోరంట్ల వీడియో కేసులో.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ను తు.చ. తప్పకుండా ఎస్పీ ఫకీరప్ప చదివారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా ఆరోపించారు. ఈ కేసును నీరుగార్చి, విషయాన్ని దారి మళ్లించేందుకు ఎస్పీ పొంతన లేని సమాధానాలు చెప్పారని మండి పడ్డారు. ఒరిజినల్ వీడియో ఒక వ్యక్తి వద్ద ఉందని.. రెండో వ్యక్తి దానిని చూస్తుంటే, మూడో వ్యక్తి రికార్డ్ చేశాడని ఎస్పీనే చెప్పారని.. దీన్నిబట్టి ఒరిజినల్ వీడియో ప్రభుత్వం వద్దనే ఉందని నిర్ధారణ అయిందన్నారు.

నగ్న వీడియోను ఫోరెన్సిక్ కి ల్యాబ్​కు పంపామని ప్రభుత్వ పెద్దలు చెప్తే.. అసలు ల్యాబ్ కే పంపలేదని ఎస్పీ నిర్ధారించారని అన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికను ఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడిస్తారని భావిస్తే.. తన సొంత అజెండాతో బోగస్ విచారణను వివరించారని ఆరోపించారు. పతనమవుతున్న వైకాపా కు అడ్డుకట్ట వేసేవిధంగా ఎస్పీ మాట్లాడారని.. ఆయన వివరణ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఒక వ్యక్తి ఫోన్లో రికార్డ్ అయిన వీడియోను, మరో వ్యక్తి ప్లే చేస్తే.. మూడో వ్యక్తి రికార్డు చేశారంటున్న ఎస్పీ.. ఆ ముగ్గురు ఎవరో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఎంపీనే గుర్తుపట్టలేని స్థితిలో ఎస్పీ ఉన్నారా? అని ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఫార్వర్డ్ చేసిన వీడియో అయినా.. అది నిజమైనదో.. కాదో తేల్చే అధునాతన సాంకేతిక హైదరాబాద్ లోనే అందుబాటులో ఉందన్నారు. తానే ఎస్పీకి ఫిర్యాదు చేశానని మాధవ్ చెప్పినప్పుడు.. ఆయన ఫోన్ స్వాధీనం చేసుకుని ఎందుకు విచారణ జరపట్లేదని ప్రశ్నించారు.

సంబంధిత కథనాలు :
గోరంట్ల మాధవ్ తీరుపై చంద్రబాబు ఘాటు స్పందన.. ఏమన్నారంటే?
"మాధవ్‌పై చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు"
ఎంపీ గోరంట్ల ఎపిసోడ్.. అనుమానం ఉంది : హోంమంత్రి వనిత
గోరంట్ల 'వీడియో' వ్యవహారంపై చర్యలు తీసుకోండి.. డీజీపీకి మహిళా కమిషన్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.