ETV Bharat / city

డిమాండ్ చేస్తే సస్పెన్షనా ..?: అమర్​నాథ్ రెడ్డి - students suspention from ANU news

అమరావతి కోసం గళం విప్పిన నలుగురు విద్యార్థులపై నాగార్జున వర్శిటీ అధికారులు సస్పెన్షన్ విధించటం సరికాదని తెదేపా నేత అమర్​నాథ్ రెడ్డి అన్నారు. విద్యార్థులు డిమాండ్ చేయడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు.

tdp-leader-amarnath-reddy-on-students-suspention-from-anu

author img

By

Published : Feb 2, 2020, 9:19 PM IST

అమరావతి కోసం గళం విప్పిన విద్యార్థులను.. ఆచార్య నాగార్జున వర్శిటీ అధికారులు సస్పెన్షన్‌ చేయటం సరికాదని మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. సస్పెన్షన్‌ చర్యను ఖండిస్తున్నామని చెప్పారు. అమరావతే రాజధానిగా కొనసాగాలన్న విద్యార్థుల డిమాండ్‌లో తప్పేముందని ప్రశ్నించారు. వీసీ వైకాపా కార్యకర్తలా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడ్డారు. నారావారిపల్లెలో వైకాపా సభకు ఎస్వీ వర్సిటీ విద్యార్థులను తీసుకెళ్లారని చెప్పారు. మరీ ఎస్వీ వర్సిటీ విద్యార్థులను అధికారులు సస్పెండ్‌ చేస్తారా? అని నిలదీశారు. రాష్ట్రంలో 90 శాతానికి పైగా ప్రజలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి : కర్నూలు జిల్లా యువతి పెళ్లికి... కరోనా గండం..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.