మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట లభించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయనకు ఉన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 30లోపు మంగళగిరిలోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరై రూ. 25 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని పేర్కొంది. వాటిని సమర్పించాక బెయిలు మంజూరు చేయాలని సంబంధిత మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది. దర్యాప్తు ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు. దుర్గాప్రసాదరావు ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. గత సెప్టెంబర్ 11న తెదేపా తలపెట్టిన ' ఛలో ఆత్మకూరు ' కార్యక్రమంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్తోన్న సమయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని అచ్చెన్నాయుడిపై కేసు నమోదైంది.
తెదేపా నేత అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట
తెదేపా నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట లభించింది. తాడేపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయనకు ఉన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.