ETV Bharat / city

'ఆలయ అర్చకుని నియామకంలో అవినీతికి ఇదే సాక్ష్యం'

విజయవాడ దాసాంజనేయ ఆలయ అర్చకుడి నియామకంలో అవినీతి జరిగిందని తెదేపా నేత కూన రవికుమార్ ఆరోపించారు. నకిలీ పంచరాత్ర సర్టిఫికెట్ కలిగిన వ్యక్తితో లక్షల్లో బేరాలాడి... ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉద్యోగం ఇవ్వాలని దేవాదాయ శాఖకు స్పీకర్ తమ్మినేని నోట్ పంపారని ఆయన అన్నారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/24-February-2020/6188118_koona.mp4
'దాసాంజనేయ ఆలయ అర్చకుని నియామకంలో అవినీతి...ఇదే సాక్ష్యం'
author img

By

Published : Feb 24, 2020, 7:51 PM IST

'దాసాంజనేయ ఆలయ అర్చకుని నియామకంలో అవినీతి...ఇదే సాక్ష్యం'

సభాపతి తమ్మినేని సీతారాం విజయవాడ కేంద్రంగా అవినీతి బాగోతం సాగిస్తున్నారని మాజీ విప్‌ కూన రవికుమార్ ఆరోపించారు. అర్చకుల నియామకంలో స్పీకర్ తమ్మినేని, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అవినీతికి పాల్పడ్డారన్నారు. విజయవాడ దాసాంజనేయ ఆలయ అర్చకుని నియామకంలో అవినీతి జరిగిందని ఆయన తెలిపారు. పంచరాత్ర అనే సర్టిఫికెట్ ఉన్న వారే అర్చకత్వానికి దరఖాస్తు చేసుకోవాలని... నోటిఫికేషన్​లో స్పష్టంగా ఉందని ఆయన అన్నారు. దాసాంజనేయ ఆలయ ప్రధాన అర్చకుడి కుమారుడు అనంత్ ..ఫేక్ సర్టిఫికెట్​తో అర్చకత్వానికి దరఖాస్తు చేశారని ఆరోపించారు. అనర్హుడికి ఉద్యోగం ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. దాసాంజనేయ ఆలయ ప్రధాన అర్చకుడితో లక్షల్లో బేరసారాలు చేసుకున్నారన్న ఆయన... దేవాదాయ శాఖకు స్పీకర్ తమ్మినేని నోట్ పంపారని వెల్లడించారు. తమ్మినేని అవినీతి బాగోతంపై తక్షణమే ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్‌చేశారు.

ఇవీ చూడండి-'ఒకరికి మేలు చేసేందుకు.. మరొకరికి అన్యాయం చేస్తారా..?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.