ETV Bharat / city

సచివాలయం వద్ద నేడు తెదేపా ఆందోళన - పోలవరం పనులు నిలిపివేత

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నుంచి ప్రతి రోజు ఒక్కో అంశంపై బయట నిరసన తెలుపుతూ వచ్చింది తెదేపా. ఇవాళ చివరి రోజు కావటంతో మూడు అంశాలపైన ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది.

tdp protest
తెదేపా ఆందోళన
author img

By

Published : Dec 17, 2019, 6:48 AM IST

పోలవరం ప్రాజెక్టు నిలిపివేత, ఇసుక కష్టాలు, రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం తదితర అంశాలపై తెలుగుదేశం నేతలు ఇవాళ ఆందోళనకు దిగనున్నారు. సచివాలయం ఫైర్​స్టేషన్ వద్ద చంద్రబాబు అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నుంచి ప్రతి రోజు ఒక్కో అంశంపై బయట నిరసన తెలుపుతూ వచ్చింది. ఇవాళ సమావేశాలకు చివరి రోజు కావటంతో మూడు అంశాలపైన ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. తమపై కక్ష సాధింపులో భాగంగానే పోలవరం ప్రాజెక్టు నిలిపివేశారని తెదేపా ఆరోపిస్తూ వస్తుంది. కృత్రిక ఇసుక కొరత సృష్టించడం వల్ల లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోయేలా ప్రభుత్వ పెద్దలు చేశారన్నది తెదేపా వాదన. తెలుగుదేశం కార్యకర్తలే లక్ష్యంగా చేస్తున్న దాడులను అరికట్టాలన్న డిమాండ్​ను ప్రభుత్వం ముందుంచింది. ఇవేకాకుండా ఉచిత ఇసుక విధానం పునరుద్ధరించటంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నదుల అనుసంధానం చేపట్టాలనే డిమాండ్లపై నేడు నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి

అత్యాచార బాధితురాలికి హోంమంత్రి పరామర్శ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.