కరోనాపై ముఖ్యమంత్రి జగన్ తేలిగ్గా మాట్లాడుతున్నారని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహించారు. రాజ్యాంగపరమైన వ్యవస్థలను అవమానించేలా జగన్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ముఖ్యమంత్రి ఏవిధంగా స్పందించిన తీరుకు అనుకూలంగానే సీఎస్ లేఖ రాశారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ అంతా ఎన్నికల సంఘం పరిధిలోనే ఉంటుందని గుర్తు చేశారు. ప్రతిపక్షాలను అణచివేయాలనే ధోరణి మంచి పద్ధతి కాదని సూచించారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా చేస్తున్నారన్న విమర్శలను తిప్పికొట్టారు. మరోవైపు.. రాష్ట్రానికి నిధులు రానీయకుండా చంద్రబాబు కుట్రచేస్తున్నారని విమర్శించడం సబబు కాదని తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్నికలకు, ఆర్థిక సంఘం నిధులకు సంబంధం లేదని ఎస్ఈసీ చెబుతున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ సమాజం గురించి తెలుసుకోవాలని హితవు పలికారు.
ఇవి కూడా చదవండి: