రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిలిచిపోవటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ వాదనలు తలెత్తుతున్నాయని...తెదేపా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తక్షణమే రాజధాని పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరాలన్నా, పెట్టుబడులు రావాలన్నా.. రాజధాని కీలకమని వ్యాఖ్యానించారు. సచివాలయం, హైకోర్టు తో పాటు పలు విద్యాసంస్థలు అమరావతిలో ఏర్పాటయ్యాక ఇప్పుడు రాజధానిని మార్చటం సరికాదని హితవు పలికారు.
ఇదీ చదవండి: