ఏపీ ఫైబర్ నెట్‌పై తెదేపా నేతలు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. టీవీ ఆన్ చేయగానే సీఎం ఫోటో వస్తుందని.. ఎస్ఈసీకి లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఫైబర్ నెట్ కనెక్షన్లు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీవీలో సీఎం ఫొటో రావడంపై తెదేపా అభ్యంతరం వ్యక్తం చేసింది. డీఫాల్ట్ కింద ఫైబర్ నెట్లో సీఎం ఫోటో వచ్చేలా ఏర్పాటు చేశారని తెదేపా ఎస్ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. వెంటనే ఫైబర్ నెట్లో సీఎం ఫొటో రాకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
ఇదీ చదవండి: పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ క్రమశిక్షణ చర్యలు