ETV Bharat / city

ఆత్మహత్యల ఘటనపై మైనారిటీ కమిషన్​కు తెదేపా ఫిర్యాదు - నంద్యాల ఘటనపై మైనార్టీ కమిషన్ కు టీడీపీ ఫిర్యాదు

నంద్యాలలో కుటుంబం ఆత్మహత్యల ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర మైనారిటీ కమిషన్​కు తెదేపా ఫిర్యాదు చేసింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరింది. పౌర హక్కులను కాపాడాల్సిన పోలీసులే వాటిని హరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.

Tdp
Tdp
author img

By

Published : Nov 10, 2020, 10:29 PM IST

సలాం కుటుంబం ఆత్మహత్యల ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర మైనారిటీ కమిషన్​కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. ఇందుకు కారకులైన డీఎస్పీ చిదానంద రెడ్డి, సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్​లపై చర్యలు తీసుకోవాలని కోరారు. పౌరుల హక్కులను కాపాడాల్సిన పోలీసులే వాటిని హరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసు యంత్రాంగం మొత్తం నిందితులను కాపాడే యత్నం చేస్తోందని ఆరోపించారు. మైనారిటీ కమిషన్​ను కలిసిన వారిలో తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్​తో పాటు హిదాయిత్, షేక్ మీరావలీ ఇతర నేతలు ఉన్నారు.

ఇదీ చదవండి

రాష్ట్రాన్ని నేరగాళ్ల రాజ్యంగా మార్చేశారు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.