ETV Bharat / city

జగన్​ ప్రభుత్వ విధానాలతో... మరో శ్రీలంకగా ఏపీ: చంద్రబాబు - new districts news

TDP on YSRCP: విద్యుత్‌ ఛార్జీలు, పన్నుల పెంపుపై ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని తెలుగుదేశం నిర్ణయించింది. వైకాపా పాలనలో ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని మరో శ్రీలంక కాబోతోందని పార్టీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. 'బాదుడే.. బాదుడు' పేరిట ఈ నెలాఖరు వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం చేపట్టాలని శ్రేణులకు అధినేత దిశానిర్దేశం చేశారు. అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారన్న బాబు.. అధికారంలోకి వచ్చాక వాటిని సరిదిద్దుతామన్నారు.

CBN
CBN
author img

By

Published : Apr 4, 2022, 3:13 PM IST

Updated : Apr 5, 2022, 2:10 AM IST

వైకాపా పాలనలో ధరాభారంపై ప్రతిపక్ష తెలుగుదేశం ప్రజాపోరాటానికి సిద్ధమైంది. ఈ నెలాఖరు వరకూ 'బాదుడే బాదుడు' పేరుతో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై కార్యకర్తలతో అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జగన్‌ ప్రభుత్వం ఏడు సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచి, ప్రజలపై వేల కోట్లు భారం వేసిందని చంద్రబాబు విమర్శించారు. సోమవారం నుంచి మొదలైన నిరసనలను గ్రామ, మండల స్థాయిలో ఈ నెలాఖరు వరకు నిర్వహించాలని స్పష్టం చేశారు. జగన్‌ ప్రభుత్వ అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. విద్యుత్తు ఛార్జీలు, చెత్త, ఇంటి పన్నులు, పెట్రో, గ్యాస్‌ ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ పెంచిన పన్నుల కారణంగా ప్రతి ఇంటిపై రూ. లక్షా పదివేల చొప్పున భారం పడుతోందన్నారు. జగన్‌ విధానాల వల్లే రాష్ట్రంలో కరెంట్‌ కొరత, కోతలు ఉన్నాయని ఆక్షేపించారు. ప్రిజనరీ పాలనలో రాష్ట్రం మరో శ్రీలంక కాబోతోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

ధరాభారంపై ప్రచారానికి వివిధ రకాల కరపత్రాలను తెలుగుదేశం రూపొందించింది. తాము అధికారం నుంచి దిగిపోయే సమయానికి ఒక మధ్య తరగతి కుటుంబం బతకడానికి నెలకు రూ. 11వేలు సరిపోయేవని పోస్టర్లలో తెలిపిన తెలుగుదేశం...ప్రస్తుత వైకాపా పాలనలో రూ. 20వేలు ఖర్చవుతోందని చెబుతోంది. సంవత్సరానికి ప్రతి కుటుంబం నుంచి జగన్‌.. రూ. లక్షా 8 వేలు దోచేస్తున్నట్లు ఆరోపిస్తోంది. 2019 నాటికి సగటు నెల సంపాదన రూ. 15 వేలుంటే ... కుటుంబానికి రూ. 4వేలు మిగులు ఉండేదని.. ఇప్పుడు అదే సగటు సంపాదనకు రూ. 9వేల లోటు ఉంటోందని కరపత్రాల్లో వివరిస్తోంది. నిత్యావసరాల ధరల విషయానికొస్తే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ. 80గా ఉన్న వంటనూనె... ఇప్పుడు ఏకంగా రూ. 150 పెరిగి 230 రూపాయలకు చేరడంతో సహా మిగిలిన అన్ని సరుకుల ధరలు గణనీయంగా పెరిగాయని....ఇదే విషయాన్ని ఇంటింటి ప్రచార ద్వారా ప్రజలకు వివరిస్తామని చెబుతోంది. ప్రిజనరీ పాలనలో ఏపీ మరో శ్రీలంక కాబోతోందంటూ పోస్టర్లలో ముద్రించింది.

Chandrababu on New Districts: అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారన్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాలను సరిదిద్దుతామన్నారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రజల అభ్యంతరాలను, నిరసనలను కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని తప్పు పట్టారు. కరెంట్ చార్జీల మోత, పన్నుల భారంపై బాదుడే బాదుడు పేరుతో ఇంటింటికీ తెలుగుదేశం నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కరెంట్ ఎందుకు పోతోందో.. బిల్లు ఎందుకు పెరిగిందో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ వ్యక్తిగత ఆదాయం కోసమే.. ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నారని మండిపడ్డారు.

వారికి సంఘీభావం: అమరావతిలో 80 శాతం కంప్లీట్ అయిన పనులను కూడా పూర్తి చెయ్యలేని జగన్.. ఇప్పుడు మరో ఐదేళ్ల సమయం కోరడాన్ని తెదేపా నేతలు తప్పుబట్టారు. సీపీఎస్ రద్దు కోసం ఆందోళనలు చేస్తున్నవారికి సంఘీభావం తెలపాలని సమావేశంలో నిర్ణయించారు.

ఇదీ చదవండి: గజదొంగలే ఆశ్చర్యపోయేలా జగన్ దోపిడీ.. మూడేళ్లలో రూ.42,172 కోట్ల భారం: చంద్రబాబు

Last Updated : Apr 5, 2022, 2:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.