ETV Bharat / city

cbn:విద్యా వ్యవస్థ మనుగడకు అది గొడ్డలిపెట్టు: చంద్రబాబు

ఎయిడెడ్ విద్యాసంస్థల పట్ల వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విద్యావ్యవస్థ మనుగడకే గొడ్డలిపెట్టని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. విద్యార్థులు, తల్లిదండ్రుల డిమాండ్ కు తగ్గట్లుగా ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకుంటే బాధితుల పక్షాన తెదేపా పెద్దఎత్తున పోరాడుతుందని హెచ్చరించారు.

చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు
author img

By

Published : Oct 26, 2021, 7:26 PM IST

ఎయిడెడ్ విద్యాసంస్థల పట్ల వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విద్యావ్యవస్థ మనుగడకే గొడ్డలిపెట్టని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకుంటే బాధితుల పక్షాన పోరాడుతామని హెచ్చరించారు. జగన్ రెడ్డి చర్యల వల్ల..... విద్యార్థులు బడిలో ఉండకుండా బజారున పడ్డారని విమర్శించారు.

ఎయిడెడ్ విద్యా విధానాన్ని నిర్వీర్యం చేస్తూ పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకోవటం సరికాదని హితవు పలికారు. ప్రభుత్వంలో ఎయిడెడ్ విద్యా సంస్థల విలీన ఉత్తర్వుల్ని తక్షణమే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే హక్కు ఈ ప్రభుత్వానికి లేదన్నారు. విద్యా సంవత్సరం మధ్యలో ఇలాంటి చర్యలు విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారం చేయడమేనని ఆక్షేపించారు.

ఎయిడెడ్ విద్యాసంస్థలకు ప్రభుత్వ సాయాన్ని నిలిపివేయటంతో పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక మధ్యలోనే చదువులు నిలిపివేయటంతో పాటు సిబ్బంది జీవితాలు ఇబ్బందులు పడే ప్రమాదం ఉందన్నారు. 150ఏళ్లుగా కొనసాగుతున్న ఎయిడెడ్ వ్యవస్థను ఎందుకు నీరు గార్చుతున్నారని చంద్రబాబు నిలదీశారు. నిరుద్యోగుల పాలిట శాపంగా మారే అనాలోచిత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు. అమ్మఒడికి బదులు బడులే కావాలని విద్యార్థులు కోరుతున్నారని చంద్రబాబు గుర్తుచేశారు.

ఇదీ చదవండి: చాలా మంది ఐఏఎస్‌లు పేద కుటుంబాల నుంచి వచ్చినవారే: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.