సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య విభేదాలు, సమస్యల్ని గుర్తించి, పరిష్కరించేందుకు ఐదుగురిని ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. 25 లోక్‌సభ నియోజకవర్గాలను ఐదు జోన్లుగా విభజించి... ఆ బాధ్యతలను బుద్దా వెంకన్న, పంచుమర్తి అనురాధ, బత్యాల చెంగల్రాయుడు, అనగాని సత్యప్రసాద్, అమరనాథ్‌రెడ్డికి అప్పగించారు.
భావసారూప్యత కలిగిన పార్టీలతో సమన్వయ బాధ్యతల్ని సీనియర్ నేత దేవినేని ఉమకు ఇవ్వగా... పార్టీ విజ్ఞాన కేంద్రం, అధికార ప్రతినిధులపై పర్యవేక్షణను పయ్యావుల కేశవ్‌కు అప్పజెప్పారు. 25 లోక్‌సభ స్థానాల నుంచి వచ్చే నివేదికలు, ఇతర అంశాలపై పార్టీ కార్యాలయం నుంచి సమన్వయం చేసే బాధ్యతను... ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి